ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"చైతు" డైరెక్టర్ తో "కిచ్చా సుదీప్" నెక్స్ట్ ప్రాజెక్ట్..!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 27, 2022, 02:34 PM

మానాడు, మన్మధ లీలై సినిమాల వరస సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తన తదుపరి సినిమాను టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య తో చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కబోతుంది. ఈ సినిమాతో చైతు తమిళ సినీరంగ ప్రవేశం చేస్తున్నాడు. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవబోతుందని తెలుస్తోంది. 
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, వెంకట్ ప్రభుతో శాండల్ వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూడా ఒక సినిమాకు కమిటైనట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని విక్రాంత్ రోణ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో స్వయంగా సుదీప్ చెప్పారు. ఐతే, వెంకట్ ప్రభుతో సినిమా చేయటానికి చాలా సమయం ఉందని, ఈ లోపు తన నుండి రెండు సినిమాలు రావొచ్చని కూడా చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa