బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కు కవల పిల్లలు పుట్టబోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. గతంలో ఆలియా రణ్‌బీర్ సరదా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించిన ఆలియా కవల పిల్లలు కాదు, మాకు పుట్టబోయేది ఒక్కరే అంటూ క్లారిటీ ఇచ్చారు. ట్విన్స్ పుట్టబోతున్నారంటూ రణ్‌బీర్ జోక్ చేశాడని, జనం ఇంత సీరియస్‌గా తీసుకుంటారనుకోలేదని అన్నారు.