నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా "బింబిసార" నుండి నిన్న లేటెస్ట్ గా రిలీజ్ ట్రైలర్ వచ్చింది. యూట్యూబ్ లో విడుదలైన ఆ ట్రైలర్ కేవలం 9 నిమిషాల్లోనే 50కే లైక్స్ తెచ్చుకుంది. ఆపై అతి తక్కువ టైంలోనే 2 మిలియన్ వ్యూస్ కూడా సంపాదించి యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ లో చోటు సంపాదించింది. నిన్న సాయంత్రం విడుదలైన ఈ ట్రైలర్ ఇప్పటివరకు 10 మిలియన్ వ్యూస్, 263 కే లైక్స్ తో దూసుకుపోతుంది.
కొత్త దర్శకుడు వశిష్ట్ డైరెక్షన్లో సోసియో ఫాంటసీ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో క్యాథెరిన్ ట్రెస్సా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5న ఈ సినిమా విడుదల కాబోతుంది.