చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలు టాప్ హీరోయిన్ లుగా ఒకప్పటి తరంలో ఎక్కువగా ఉండేవారు. ఆ తర్వాత ఆ సంఖ్య క్రమేపీ తగ్గుతూ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తున్న తరుణంలో మన హీరోయిన్లు ఇతర భాషలలో నటిస్తున్నారు. తాజాగా కలర్‌ఫోటో హీరోయిన్ చాందినీ చౌదరి తమిళ సినిమాలో అవకాశం కొట్టేసింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలుపుతూ, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానంది.