నిన్నటితరం సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ పూర్ణోదయా ఫిలిమ్స్ "ఫస్ట్ డే ఫస్ట్ షో" తో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇవ్వబోతుందన్న విషయం తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు అంటే సెప్టెంబర్ 2వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది.
వంశీధర్ గౌడ్, లక్ష్మి నారాయణ్ కలిసి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ రెడ్డి, సంచితా బసూ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాధన్ సంగీతం అందిస్తున్నారు. ఈ తరం యువత వ్యవహారశైలితో, ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి కథ, డైలాగులు, స్క్రీన్ ప్లే అందించింది "జాతిరత్నాలు" ఫేమ్ అనుదీప్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa