మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు విజయాలను కట్టబెడుతున్నారని హిందీ సినిమా దర్శకుడు, నిర్మాత కరణ్‌జోహార్ అన్నారు. బాలీవుడ్ కథ ముగిసిపోయిందనేది ఒక చెత్త అభిప్రాయమని, కాకపోతే సౌత్ సినిమాల జోరుముందు హిందీ బ్లాక్‌బస్టర్‌లు ఎవరికీ కనపడట్లేదని పేర్కొన్నారు. పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్2 విజయాలు బాలీవుడ్ సినిమాలని కప్పేశాయని శనివారం ఓ ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు.