ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమా ఏ ఒక్కరిదో కాదు: బాలకృష్ణ

cinema |  Suryaa Desk  | Published : Sun, Jul 31, 2022, 06:59 AM
సినిమా అందరి కష్టార్జితమని, ఏ ఒక్కరిదో కాదని ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. శనివారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరిగిన సి.నారాయణరెడ్డి 91వ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు జీవిత సాఫల్య స్వర్ణ కంకణం ప్రదానం చేశారు. తనలోని నటుడ్ని గుర్తించి ఎన్టీఆర్‌కు చెప్పింది సి.నారాయణరెడ్డేనని బాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com