నితిన్ హీరోగా నటించిన సినిమా 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమాకి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయినిగా కృతి శెట్టి నటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను శనివారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను ఇప్పుడు మేకర్స్ విడుదల చేసారు మరియు ఇప్పుడు దీనికి మంచి స్పందన వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ 11 గంటల్లోనే 7 మిలియన్లకు పైగా వ్యూస్‌ని క్రాస్ చేసి ప్రేక్షకుల నుండి సాలిడ్ రెస్పాన్స్‌ను అందుకుంది. మహతి సాగర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.