బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా లాల్ సింగ్ చడ్డా. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా తాజాగా అమీర్ ఖాన్, చైతూ, చిరంజీవితో కలిసి నాగార్జున స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్ లో భాగంగా అమీర్ వేసిన ఓ ప్రశ్నకు సమాధానంగా చిరంజీవి తన ఫస్ట్ లవ్ గురించి చెప్పారు. ఏడవ తరగతిలో ప్రేమలో పడ్డానని చిరు తెలిపారు. అమ్మాయి సైకిల్ తొక్కుతూ వస్తుంటే తననే చూసేవాడినని చిరు చెప్పారు.