ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"థ్యాంక్యూ"మూవీ నుంచి 'థ్యాంక్యూ' పాట లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 01, 2022, 09:15 AM

పల్లవి:
కలలా కరిగిందే నువు చేసిన
అందమైన గాయం… థ్యాంక్​ యూ
ఇపుడీ ఎదలోని బరువంతా
చిటికెలోన మాయం… థ్యాంక్​ యూ

నువు చేసినా త్యాగముకు
మనసును నిలువున తడిపే
జ్ఞాపకములకు అన్నిటికీ థ్యాంక్​ యూ

ఏ ఋణమే చోటా మిగిలిపోయిందో… థ్యాంక్​ యూ
ఆ దరికే చేరి చెబుతున్నా… థ్యాంక్​ యూ
(థ్యాంక్​ యూ)

వెలుతురులో నను కమ్మిన చీకటి కడిగి
లోకము చూపిన కన్నులకూ
సాయం చేసిన చేతుల విలువను తెలిపే
మమతలకే థ్యాంక్​ యూ
ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓఓ
ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓఓ

కలలా కరిగిందే నువు చేసిన
అందమైన గాయం… థ్యాంక్​ యూ
ఇపుడీ ఎదలోని బరువంతా
చిటికెలోన మాయం… థ్యాంక్​ యూ
(థ్యాంక్​ యూ… థ్యాంక్​ యూ)

చరణం:
ఎపుడో వేరైనా నీలోనే నన్ను దాచినావా నేస్తం
గతమే చేదైన చిరునవ్వుతో చేరువయ్యినావా నేస్తం
కలవని దారులు ఒకటౌతాయని తెలిపి
నీ జతలోనే నను నిలిపి
నీకిక మేమున్నామనే నిండుగ పలికే
ఓ నేస్తం… థ్యాంక్​ యూ

తమ చెయ్యందించి
నను గమ్యం చేర్చే (థ్యాంక్​ యూ)
ప్రతి మనసుకు నేడు చెబుతున్న
థ్యాంక్​ యూ (థ్యాంక్​ యూ)

నను సరిదిద్దిన నిన్నటి నా తప్పులకి
నడకలు నేర్పిన దారులకీ
నా కన్నీటిని తుడిచిన నీ చేతులకి
అందరికీ… థ్యాంక్​ యూ
ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓఓ
ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓఓ






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com