ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్వేషణ మూవీ నుంచి 'కీరవాణి' సాంగ్ లిరిక్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 03, 2022, 07:32 AM

సా నిసరిసాని… సా నిసమగామరి
పదసా నిసరీసాని… సా నిసమగామరి
పదసససని రిరిరిస గగగరి మమమగ
పా, సా ని ద ప మ గ రి స ని

కీరవాణి చిలకలా హొలికెరు పాడవేమే
వలపులే తెలుపగా… విరబూసిన ఆశలు
విరితేనెలు చల్లగ… అలరులు కురిసిన
ఋతువుల తడిసిన మధురసవాణి
కీరవాణి… చిలకలా హొలికెరు పాడవేమే
వలపులే తెలుపగా ఆ ఆ

గరిస పమగ పాని… సరిగ రిగస నీప
ఈ పూలలో అందమై… ఈ గాలిలో గంధమై
నా తోటలో చైత్రమై… ఈ బాటనే నడచిరా

నీ గగనాలలో నే చిరుతారనై
నీ అధరాలలో నే చిరునవ్వునై
స్వరమే లయగా ముగిసే
సలలిత కలరుత స్వరనుత గతియుత
గమకము తెలియకనే

కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా
ఇలరాలిన పూవులు… వెదజల్లిన తావుల
అలికిడి ఎరుగని పిలుపుల
అలిగిన మంజులవాణి
కీరవాణి… చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా

నీ కన్నులా నీలమై… నీ నవ్వులా వెన్నెలై
సంపెంగలా గాలినై… తారాడనా నీడనై
నీ కవనాలలో నే తొలి ప్రాసనై
నీ జవనాలలో జాజుల వాసనై

ఎదలో ఎదలే కదిలే
పడచుల మనసుల పంజర శుకముల
పలుకులు తెలియకనే

కీరవాణి చిలకలా కలకలా పాడలేదు
వలపులే తెలుపగా విరితేనెలు చల్లగ
అలరులు కురిసిన ఋతువుల తడిసిన
మధురసవాణి కీరవాణి
చిలకలాహొలికెరు పాడవేమే
వలపులే తెలుపగా






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com