టాలీవుడ్, కోలీవుడ్.. బాలీవుడ్ అనే తేడా నే లేదు. అన్నిచోట్లా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కు అభిమానులు ఉన్నారు. బాహుబలి, కేజీఎఫ్ (ఐటమ్ సాంగ్) సినిమాలతో హిందీ ప్రేక్ష కులను అలరించింది. అంతకుముందు కూడా ఆమె పలు బాలీవుడ్ లో సినిమాల్లో నటించింది. కానీ అక్కడే సెటిల్ కాలే కపోయింది. అయితే ఇప్పటికీ.. బాలీవుడ్ నుంచి ఆఫర్లు అందుకుంటోంది. మధు బండార్కర్ దర్శకత్వంలో తమన్నా నటించిన 'బబ్లీ బౌన్సర్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తరచూ ముంబై వెళ్లోస్తోంది. ఈ క్రమంలో మంగళవారం క్యాజువల్ డ్రెస్ లో ముంబై ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కింది. రెడ్ గ్రాఫిక్ షర్ట్, టెథర్డ్ డెనిమ్ ప్యాయింట్ ధరించి.. టోట్ బ్యాగ్ మరియు తెల్లటి స్నీకర్స్ ధరించి ట్రెండీ లుక్ లో ఆకట్టుకుంది.