పెళ్లి తర్వాత కూడా యంగ్ హీరోలతో రొమాన్స్ చేస్తోంది కత్రినా కైఫ్. 'ఫోన్ భూత్'లో యువ హీరోలు ఇషాన్ కట్టర్, సిద్ధార్డ్ చతుర్వేది తో కలిసి నటించింది. ఈ కామెడీ ఎంట రైనర్ లో రొమాంటిక్ డోస్ ఎక్కువేనట. అక్టోబర్ 7న ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ షురూ చేసింది. తాజాగా కాఫీ విత్ కరణ్ సీజన్ -7లో ఈ చిత్రబృందం సందడి చేసినట్టు తెలిసింది. ఇషాన్, సిద్ధార్ లతో కలిసి కత్రినా పాల్గొంది. ఈ సందర్భంగా చేసిన ఫోటో షూట్ ఫోటోలు బయటికి చ్చాయి. ఇందులో బ్లాక్ & వైట్ షర్ట్ లో కత్రినా కత్తిలా కని పిస్తుంది.