త్వరలో తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ సరికొత్త ఫ్యాషన్ ఫాలో అవుతోంది. ఇంతకు ముందు టైట్ ఫిట్ డ్రెస్ లతో దర్శనమి చ్చేది. అయితే గర్భవతి అయిన తర్వాత కంఫర్ట్ కు పెద్దపీట వేస్తూ. లూస్ డ్రెస్ లను ధరిస్తోంది. అందులోనూ తన స్టైల్ చూపిస్తోంది. గౌను, పంజాబీ డ్రెస్.. ఇలా ఏది ధరించిన వదులుగా ఉండేలా చూసుకుంటోంది. తద్వారా బేబీ బంప్ కనిపించడం లేదు. ఇక ఇటీవల కాస్త బరువు పెరిగిన అలియా బబ్లీ లుక్ లో క్యూట్ గా కనిపిస్తోంది. అలియా నటించిన డార్లింగ్స్' శుక్రవారం (ఆగస్టు 5) నుంచి నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ కామంది. భర్త రణ్ బీర్ కపూర్ కు జంటగా నటించిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1 సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.