నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబిసార ప్రారంభం నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచింది. ఈ మూవీలో త్రిగర్తల రాజు బింబిసారుడిగా కళ్యాణ్ రామ్ నటించనుండగా టైం ట్రావెల్ నేపథ్యంలో సాగె సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఇది తెరకెక్కినట్లు తెలుస్తోంది. అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా దర్శకుడు మల్లిడి వశిష్ట ఈ మూవీని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని, ఆగష్టు 5 న విడుదల కానున్న మూవీ పెద్ద విజయం అందుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది యూనిట్.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె హరికృష్ణ ఎంతో భారీ వ్యయంతో నిర్మించిన ఈ మూవీలో సంయుక్తా మీనన్, క్యాథరీన్ త్రెసా, వరీన వాహబ్ హీరోయిన్స్ గా నటించగా చిరంతన్ భట్ సంగీతాన్ని కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన బింబిసార ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ రెండూ కూడా ఇప్పటివరకు మూవీ పై ఉన్న అంచనాలు అమాంతం ఆకాశమంత ఎత్తుకి తీసుకెళ్లాయి. మరొక రెండు రోజులలో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండడంతో టికెట్స్ ప్రీ సేల్స్ లో బింబిసార అదరగొట్టనున్నట్లు చెప్తున్నారు. మరి అందరిలో ఈ స్థాయి అంచనాలు ఏర్పరిచిన బింబిసార రిలీజ్ తరువాత ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి.