చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కార్తికేయ 2' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో నిఖిల్ లేడీ లవ్‌గా గ్లామర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది. తాజాగా ఈరోజు 'కార్తికేయ 2' మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించి, ఈ సినిమా ఆగష్టు 13, 2022న థియేటర్లలో విడుదలవుతుందని ప్రకటించింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు.