అక్కినేని నాగచైతన్య తన బాలీవుడ్ డిబట్ "లాల్ సింగ్ చద్దా" ప్రమోషన్స్ నిమిత్తం ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. అక్కడ వరస ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. లేటెస్ట్ గా చైతు బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని ఆయన ఆఫీస్ లో కలిశారు. వీరిద్దరూ ఎందుకు కలిశారు? ఫ్యూచర్ లో భన్సాలీ చైతుకేమన్నా ఆఫర్ ఇవ్వబోతున్నాడా? అన్నది తెలియాల్సి ఉంది.
అద్వైత్ చందన్ డైరెక్షన్లో హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ (1994) కి ఇండియన్ రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఆమిర్ ఖాన్, కరీనాకపూర్ ఖాన్, నాగచైతన్య కీలక పాత్రలు పోషించారు. ప్రీతం సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.