వైజయంతి మూవీస్ నిర్మించిన "మహానటి" చిత్రం 2018లో విడుదలై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో మహానటి సావిత్రిగా కీర్తి సురేష్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసి, నేషనల్ అవార్డును కొట్టేసింది. ఆ మూవీలో కీలక పాత్రలో నటించిన సమంత కూడా అద్భుతంగా నటించి, నెరేటర్ గా సినిమాను ప్రేక్షకులను దగ్గర చేసింది. సమంత పోషించిన "మధురవాణి" పాత్ర ఇప్పటికి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.
మహానటి లో సమంత ఎంతటి క్రూషియల్ రోల్ లో నటించి మెప్పించిందో, లేటెస్ట్ గా వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న "సీతారామం" లో రష్మిక మండన్నా అంతే ఇంపార్టెంట్ రోల్ లో నటించినట్టు తెలుస్తుంది. సినిమాను ముందుకు నడిపించే పాత్రలో రష్మిక నటించడానికి ఒప్పుకోవడమే చాలా గ్రేట్. ఎందుకంటే, పుష్ప తదుపరి ఆమె క్రేజ్ ఆకాశాన్ని అందుకుంది. "అఫ్రీన్" అనే కాశ్మీరీ ముస్లిం యువతి పాత్రలో సీతారామం లో నటించిన రష్మిక, మహానటి మధురవాణిని అదేనండి సమంతను రీచ్ అవుతుందా? తెలియాలంటే, రేపు విడుదల కాబోయే సీతారామం సినిమాను చూడాల్సిందే.