ఒక అభిమాని బాలయ్య బాబును ఎలా ఐతే చూడాలనుకుంటాడో అచ్చు అలానే డైరెక్టర్ గోపీచంద్ మలినేని "NBK107" మూవీ ద్వారా బాలయ్యను ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ఈ సినిమాను తన కలల ప్రాజెక్టుగా ఎంతో అపురూపంగా తీర్చిదిద్దుతున్నారు. NBK 107 టీజర్ తోనే ఈ విషయం క్లియర్ గా అర్ధమైంది.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి ఒక స్పెషల్ అండ్ సర్ప్రైజింగ్ అప్డేట్ రాఖీపూర్ణిమ నాడు రాబోతుందని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే, ఈ సినిమాలో బాలయ్యకు వరలక్ష్మికి మధ్య హార్ట్ ఫెల్టింగ్ ఎమోషనల్ బ్రదర్ అండ్ సిస్టర్ సీన్స్ ఉంటాయని, సో... రాఖీపూర్ణిమ రోజున స్పెషల్ సర్ప్రైజ్ తో ప్రేక్షకులను థ్రిల్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారట. ఐతే, ఈ విషయంపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది. ప్రస్తుతం కర్నూల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో శృతి హాసన్ కధానాయిక కాగా, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.