ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమల్ హాసన్ "ఇండియన్ 2" పై లేటెస్ట్ మేజర్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Aug 04, 2022, 06:11 PM

కమల్ హాసన్ - శంకర్ కాంబోలో,1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ "ఇండియన్" (తెలుగులో "భారతీయుడు") ను దాదాపు పాతికేళ్ళ తర్వాత సీక్వెల్ "ఇండియన్ 2"ను తెరకెక్కబోతుందన్న విషయం తెలిసిందే. కొంత షూటింగును పూర్తి చేసిన తర్వాత పలు కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. దర్శకుడు శంకర్ కి, నిర్మాతలకు మధ్య తెలెత్తిన క్రియేటివ్ డిఫరెన్సెస్ అండ్ ఈగో క్లాషెస్ ఇందుకు కారణమని తెలుస్తుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఇండియన్ 2 షూటింగ్ సెప్టెంబర్ 13 నుండి మొదలు కాబోతుందని తెలుస్తుంది. ఈ విషయాన్ని ఇండియన్ 2 లో హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ తన ఇన్స్టా లైవ్ లో అభిమానులకు తెలిపింది. సో,, ఈ ఒక్క విషయంతో ఇండియన్ 2 మళ్ళీ పట్టాలెక్కబోతుందని, కాజల్ ఈ సినిమాలో కంటిన్యూ అవుతుందని క్లారిటీ వచ్చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com