చందు మొండేటి డైరెక్షన్లో నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన "కార్తికేయ 2" విడుదలకు అన్ని ఆటంకాలే. విడుదల తేదీ ఖరారవ్వడం, బుకింగ్స్ ఓపెన్ చెయ్యడం... కట్ చేస్తే, మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడం ... ఇలా రెండు సార్లు కార్తికేయ 2 వాయిదా పడుతూ వచ్చింది. ఆఖరికి జూలై 22 నుండి ఆగస్టు మొదటి వారానికి వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఆగస్టు 12న అంటే ఈ శుక్రవారం విడుదలవుతుందని అంతా అనుకున్నారు కానీ, పలు కారణాల వల్ల ఒక్కరోజు ఆలస్యంగా అంటే ఆగస్టు 13న శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా శనివారానికి వాయిదా పడడం కార్తికేయ 2 కు కలిసొచ్చే అంశమని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే, గతంలో నిఖిల్ నటించిన స్వామి రా రా చిత్రం కూడా శనివారం విడుదలై, సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ లెక్కన ఇప్పుడు కార్తికేయ 2 కూడా సూపర్ హిట్ అవుతుందని నిఖిల్ అభిమానులు పోస్ట్ పోన్ మెంటును కూడా ఎంజాయ్ చేస్తున్నారు.