బాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోయిన్ ఆలియాభట్ ప్రస్తుతం గర్భం దాల్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ లో స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లాడిన ఆలియా ప్రెగ్నన్ట్ అయ్యాక కూడా సినిమాల్లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. తన హాలీవుడ్ డిబట్ మూవీ షూటింగ్ సమయంలోనే ప్రెగ్నన్ట్ అని ఎనౌన్స్ చేసిన ఆలియా, ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా, ఆ మూవీ షూటింగ్ పూర్తయ్యాకే ఇండియాకు తిరిగొచ్చింది. ఇక్కడికొచ్చాక కూడా, తాను నటించి, నిర్మించిన "డార్లింగ్స్" ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీగా ఉంది. తాను హెల్తి అండ్ ఫిట్ గా ఉన్నానని, ఎలాంటి రెస్ట్ తనకు అవసరం లేదని, బిడ్డ పుట్టిన కొన్ని నెలల మెటర్నిటీ లీవ్ తరవాత కొత్త సినిమాలకు సైన్ చేస్తానని చెప్పుకొచ్చింది.