నందమూరి తారక రామారావు, బసవతారకం ల నాల్గవ కుమార్తె కంటమనేని ఉమా మహేశ్వరి గారు సోమవారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉమా మహేశ్వరి తన గదిలోని ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయింది. 52 ఏళ్ళ వయసులో ఉమా మహేశ్వరి సూసైడ్ చేసుకోవడం నందమూరి ఫ్యామిలీని తీవ్ర శోకానికి గురిచేస్తుంది.
ఇదిలా ఉండగా, ఉమా మహేశ్వరి ఇంటికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లక్ష్మి ప్రణతి, ఎన్టీఆర్ తల్లి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో హాజరయ్యారు. మధ్యాహ్నమే ఉమా మహేశ్వరి అంత్యక్రియలు జరగ్గా, సాయంత్రం తారక్ అండ్ ఫ్యామిలీ ఉమా కుటుంబ సభ్యులను ఓదార్చాడని వెళ్లారు.