ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురువారం సి కళ్యాణ్ వంటి పరిశ్రమ ప్రతినిధులతో కలిసి ప్రెస్సుమీట్ నిర్వహించారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అత్యున్నత సంస్థ అని, అక్కడ అన్ని నిర్ణయాలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆగస్ట్ 1 నుంచి టాలీవుడ్ నిర్మాతలు సమ్మె చేస్తున్నారు.దిల్ రాజు మాట్లాడుతూ, "వివిధ ముఖ్యమైన సమస్యలపై చర్చించడానికి నాలుగు కమిటీలు ఏర్పాటు చేయబడ్డాయి అని తెలిపారు.యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌కు నిర్ణయం తీసుకునే అధికారాలు లేవు. ఏదైనా ఛాంబర్‌లో నిర్ణయించుకోవాలి అని అన్నారు.