బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఇటీవలే "పృథ్విరాజ్" సినిమాతో ప్రేక్షకులను పలకరించగా, ఆ సినిమాకు ప్రేక్షకులు అనుకున్నంత స్థాయిలో కనెక్ట్ కాలేకపోయారు. దీంతో ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.
అక్షయ్ నటిస్తున్న కొత్త చిత్రం "రక్షాబంధన్". ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్లో కామెడీ డ్రామాగా రూపొందన ఈ చిత్రం ఆగస్టు 11వ తేదీన విడుదల కాబోతుంది. లేటెస్ట్ గా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ దుబాయ్ లోని ఫెస్టివల్ సిటీ లో స్క్రీనింగ్ కానుందట. ఈ అవకాశం పొందిన తొలి ఇండియన్ సినిమా ఇదే. దీంతో అక్కీభాయ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.