ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నితిన్ "MNV" నుండి 'పోరీ సూపరో' సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 06, 2022, 06:56 PM

MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్, 'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "మాచర్ల నియోజకవర్గం". శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ థెరిస్సా మరో హీరోయిన్ గా నటిస్తుంది. మహతీ స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి 'పోరీ సూపరో' అనే కూల్ పార్టీ సాంగ్ యొక్క ఫుల్ వీడియో సాంగ్ ను కొంచెంసేపటి క్రితమే మేకర్స్ విడుదల చేసారు. నితిన్, కృతిల స్టైలిష్ డాన్స్ స్టెప్స్ చాలా బాగున్నాయి. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, గీతామాధురి ఆలపించగా, కృష్ణకాంత్ సాహిత్యమందించారు. పోతే, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa