ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆహ్ ఇద్దరు ఇంటి సభ్యులు నాకు నచ్చలేదు

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 08, 2018, 11:57 AM

వంద రోజులకు పైనే సాగిన రియాల్టీ షో బిగ్ బాస్ 2 విజయవంతంగా ముగిసింది. ఊహించినట్లే కౌశల్ విజేతగా నిలిచారు. అందరూ ఒకవైపు.. తానొక్కడే మరోవైపు నిలిచినా.. గెలుపు మాత్రం అతన్ని వీడిపోలేదు. కౌశల్ ను అభిమానించే అతడి ఫ్యాన్స్ ఏకంగా కౌశల్ ఆర్మీ పేరుతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయటం.. ఆన్ లైన్లో అతడికి భారీగా మద్దతు ఇవ్వటం తెలిసిందే.


ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ విజేతగా నిలిచిన కౌశల్ తాజాగా ఒక మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికరవిషయాన్ని వెల్లడించారు. బిగ్ బాస్ లో ఎవరి మీద ఎక్కువ కోపం అన్నంతనే.. కౌశల్ టోన్ మారిపోవటమే కాదు.. తేజస్విని.. బాబు గోగినేని అంటే తనకు చలా కోపమని చెప్పారు. 


తానెందుకంతగా కోపగించుకుంటానన్న విషయాన్ని చెప్పిన కౌశల్.. తాను భోజనం చేస్తున్నప్పుడు తేజస్విని నన్ను సిగ్గులేకుండా తింటున్నావని అందని.. చాలాసార్లు బ్యాడ్ వర్డ్స్ వాడిందని.. అవన్నీ టెలికాస్ట్ అయ్యాయో లేదో తనకు తెలీదని చెప్పారు.


 


ఇక.. బాబు గోగినేని ప్రతి టాస్క్ చీటింగేనని.. కౌశల్ లెవెల్ ఏంటి? అన్నట్లు మాట్లాడారని.. నాలుగో వారం వరకూ తాను బాబును చాలా నమ్మానని..పర్సనల్స్ షేర్ చేసినట్లుగా చెప్పారు. ఒక బ్రదర్ గా షేర్ చేసుకున్న విషయాన్ని బాబు గోగినేని బయటపెట్టటంతో తాను చాలా బ్యాడ్ గా ఫీల్ అయినట్లుగా కౌశల్ చెప్పారు. బిగ్ బాస్ షో అయిపోయి వారం దాటిపోయినా.. కౌశల్ కు మాత్రం ఆ ఇద్దరి మీద ఇంకా కోపం తగ్గలేదే!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa