హాలీవుడ్ నటి అన్నే హేచే(53) చికిత్స పొందుతూ మరణించినట్లు ఆమె ప్రతినిధి శుక్రవారం ప్రకటించారు. ఆగస్టు 5న కారు ప్రమాదంలో, తలకు బలమైన గాయం కావడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. మెదడు పనితీరు ఆగిపోవడంతో చట్టబద్ధంగా ఆమె మరణించారని ప్రతినిధి హోలీ బైర్డ్ తెలిపారు. ఆమె అవయవాలను దానం చేయనున్నట్లు వెల్లడించారు. 1990ల నాటి సినిమాలు డోనీ బ్రాస్కో, సిక్స్ డేస్, సెవెన్ నైట్స్‌తో ఆమె ఎంతో పేరొందారు.