2008 సంవత్సరంలో పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా చిత్రం ఎంత పెద్ద హిట్టో మనకు తెలిసిందే. అయితే తాజాగా పవర్ స్టార్ అభిమానులను అలరించేందుకు లేటెస్ట్ టెక్నాలజీతో జల్సా మళ్ళీ విడుదల కానుంది.
సెప్టెంబరు 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని 4కే టెక్నాలజీతో రీ-మాస్టర్ చేశారు. దీంతోపాటు అద్భుతమైన శబ్దనాణ్యతను అందించే డాల్బీ అట్మోస్ పరిజ్ఞానాన్ని జోడించారు.