టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ఇటీవలే "భళా తందనానా" సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. లేటెస్ట్ గా శ్రీవిష్ణు నటించిన కొత్త చిత్రం "అల్లూరి".
ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఇందులో కయదు లోహర్ హీరోయిన్ కాగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు ఖాకీ దుస్తులు ధరించి, గన్ చేతపట్టి ఒక ఫెరోషియస్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేసారు. ఈ మేరకు సెప్టెంబర్ 23వ తేదీన అల్లూరి మూవీ థియేటర్లలో విడుదల కాబోతుంది.