ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ "రౌద్రం రుధిరం రణం (RRR)". ఇంకా ఇందులో ఆలియాభట్, అజయ్ దేవగణ్, ఒలీవియా మోరిస్, శ్రేయ కీలకపాత్రలు పోషించారు. భారతదేశపు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలలో ఒకటిగా, పాన్ ఇండియా మాత్రమే కాక పాన్ వరల్డ్ స్థాయిలో ఇండియన్ సినిమాకు పేరు ప్రతిష్టలు తెచ్చి పెడుతున్న ఈ మూవీ లేటెస్ట్ గా ఒక అరుదైన ఘనతను సాధించింది.
సాటర్న్ అమెరికన్ అవార్డ్స్... సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, హారర్ సినిమాలకు తగిన గుర్తింపు నిచ్చి సత్కరించే అవార్డుల కార్యక్రమం. 2022 సంవత్సరానికి గానూ ఈ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో RRR మూవీకి మూడు విభాగాల్లో నామినేషన్స్ వచ్చాయి. డైరెక్షన్, యాక్షన్ / అడ్వెంచరస్ ఫిలిం, ఇంటర్నేషనల్ ఫిలిం...ఇలా మూడు విభాగాల్లో నామినేషన్స్ సంపాదించిన RRR మూవీ బ్యాట్ మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్, షాంగ్ చి, స్పైడర్ మ్యాన్ వంటి ఇంటర్నేషనల్ మూవీస్ తో తలపడనుంది.
![]() |
![]() |