బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియాభట్ కి 2022 ఏడు బాగా కలిసొచ్చింది. ఎందుకంటే ఈ ఏడాదిలోనే ఆలియా నటించిన ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ "గంగూభాయ్ కతియావాడి", పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన "RRR" విడుదలై బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
లేటెస్ట్ గా ఆలియా నటించి, నిర్మించిన "డార్లింగ్స్" కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. డైరెక్ట్ ఓటిటి రిలీజైన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో దాదాపు 16 దేశాలలో ట్రెండింగ్ లో ఉంది. నెట్ ఫ్లిక్స్ నాన్ ఇంగ్లిష్ ఇండియన్ మూవీస్ లో 10 మిలియన్ వ్యూయింగ్ హావర్స్ తో డార్లింగ్స్ మూవీ గ్లోబల్ లెవెల్ లో అత్యధిక వ్యూర్షిప్ ను సాధించింది.
ప్రొఫెషనల్ గానే కాక పర్సనల్ గా కూడా ఆలియాకు ఈ ఏడాది అంతా శుభమే జరిగింది. ఐదేళ్లుగా ప్రేమించిన రణ్ బీర్ ను ఏప్రిల్ లో వివాహమాడిన ఆలియా గత నెలలోనే తన తొలి ప్రెగ్నన్సీ ని ఎనౌన్స్ చేసి అందరిని షాక్ కు గురి చేసింది.
![]() |
![]() |