నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, చందు మొండేటి డైరెక్షన్లో రూపొందిన యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ "కార్తికేయ 2". ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 13న అంటే ఈరోజే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిషోతోనే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రం హైదరాబాద్ ప్రీమియర్స్ కి డైరెక్టర్ చందు మొండేటి, "బింబిసార" తో డెబ్యూ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్న వసిష్ఠ కలిసి వచ్చారు. సూపర్ హిట్ కొట్టినందుకు వసిష్ఠ కు చందు మొండేటి శుభాకాంక్షలను తెలియచేయగా, చందుకు వసిష్ఠ కూడా గ్రాండ్ సక్సెస్ అందుకోవాలని బెస్ట్ విషెస్ తెలియచేసారు. ఈ రెండు సినిమాలలో కీలకపాత్రలను పోషించిన కమెడియన్ శ్రీనివాసరెడ్డి కూడా వీరితో జత కలవడం విశేషం.