ఛలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న మొదటి సినిమాతోనే సక్సెస్ను దక్కించుకుంది. ఆ సక్సెస్ తో విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ అవకాశం రష్మిక కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. తెలుగులో ప్రస్తుతం రష్మిక టాప్ హీరోయిన్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలు కూడా ఈమెతో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇంతటి క్రేజ్ ను దక్కించుకున్న రష్మిక మాత్రం తనకు ఇంత క్రేజ్ ఎలా వచ్చిందో ఇంతగా ప్రేక్షకులు తనను ఎందుకు అభిమానిస్తున్నారో అర్థం కావడం లేదు అంటోంది.
తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన రష్మిక.. నేను ఒక మంచి నటిని అనుకోవడం లేదు. నటనలో నేను ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. నేను ఇంకా చాలా నటనలో ఓనమాల వద్దే ఉన్నాను. నా నటన నాకే సరిగా నచ్చదు తన ప్రతి సినిమాకు నటనలో మెరుగు పర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇక నా అందం గురించి కూడా పలువురు పొగడ్తలు గుప్పిస్తున్నారు. కాని నాకంటే అందగత్తెలు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు. అయినా కూడా నాకే ఇంత క్రేజ్ ఎలా వచ్చిందో తెలియడం లేదంది.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే లక్షణం రష్మికలో క్లీయర్ గా తెలుస్తుంది. సూపర్ హిట్ దక్కిన ఏ హీరోయిన్ అయినా కూడా తానే గొప్ప అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. కాని రష్మిక మాత్రం తానో సాదారణమైన హీరోయిన్ నని ఇంకా తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పడం అభినందనీయం. ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రెడ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. దాంతో పాటు కన్నడం మరియు తెలుగులో మరికొన్ని సినిమాలను కూడా ఈమె చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa