ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకు నచ్చింది తింటా... ఎక్కువ సేపు యోగా చేస్తా

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 11, 2018, 12:59 PM

నాకు నచ్చింది తింటా. ఎక్కువ సేపు యోగా చేస్తా. అదే నా సీక్రెట్‌ అంటోంది అందాల భామ హన్సిక. సాధారణంగా తారలు ఎక్కడ లావై పోతామోనని మిత ఆహారాన్ని తీసుకుంటుంటారు. అంతేకాదు తాము నోరు కట్టేసుకోవాల్సి వస్తుంటుందని కొందరు తారలైతే బహిరంగంగా వాపోతుంటారు కూడా. ఈ విషయంలో హన్సిక మాత్రం తాను తీసుకునే ఆహారాన్ని ఏ మాత్రం తగ్గించదట. నచ్చింది హాయిగా తినేస్తుందట. అయితే క్రమం తప్పకుండా ప్రతీరోజూ యోగా, వ్యాయామం చేస్తాను. దాంతో శరీరం మన మాట వింటుంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు నాలుగు కిలోల బరువు కూడా తగ్గాను. ఆహారం విషయంలో మాత్రం ఎలాంటి నిబంధనలు పెట్టుకోలేదు. రెగ్యులర్‌గా ఏం తింటానో…అదే ఆహారాన్ని తీసుకుంటున్నాను. కేవలం యోగా, వ్యాయామంతోనే నా శరీర ఆకృతిని తగినవిధంగా తీర్చిదిద్దుకోగ లుగుతున్నాను అని హన్సిక చెప్పుకొచ్చింది. ఒకప్పుడు ఏడాదికి ఏడెనిమిది సినిమాల్లో నటించాను. ఇప్పుడు మాత్రం నాలుగు సినిమాల్లోనే నటిస్తున్నా అని అంటున్న ఆమె అప్పుడే 50 చిత్రాల మైలురాయిని చేరుకుంది. ఇది తనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెబుతున్న ఆమె చేతిలో మూడు చిత్రాలున్నాయి. అవన్నీ తమిళ చిత్రాలే. తుప్పాక్కి మునై, 100, మహా చిత్రాలలో నటిస్తున్న ఆమెకు తెలుగులో అవకాశాలు సన్నగి ల్లాయి. లక్కున్నోడు, గౌతమ్‌నంద వంటి చిత్రాలు అనుకున్నంతగా ఆడకపోవడంతో తెలుగులో అవకాశాలు ఆమె దరిచేరడం లేదని అంటున్నారు. ఏదిఏమైనా ఇప్పుడు తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, తన సినీ ప్రయాణం హాయి హాయిగా సాగుతోందని ఆమె ఆనందంతో చెబుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa