ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుండుతో నటించమన్నా నాకు ఇష్టమే

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 11, 2018, 01:02 PM

మసాన్‌, హరామ్‌ఖోర్‌ చిత్రాలతో బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న నాయిక శ్వేతా త్రిపాఠీ. ప్రస్తుతం ట్రిప్‌ 2 అనే చిత్రంలో నటిస్తున్న శ్వేతా…పాత్రను పండించేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమే అంటోంది. క్యారెక్టర్‌కు కావాల్సినట్లు నటిస్తానని చెబుతోంది. గ్లామర్‌ పాత్రను తనను ఉద్వేగపరచవని అంటోంది. ఇటీవల శ్వేతా మాట్లాడుతూ…నేనొక నటిని. ఓ చిత్రంలో ఒక్క సన్నివేశంలో నటించినా, పూర్తి సినిమాలో సాగినా తేడా ఉందని భావించను. గ్లామర్‌ పాత్రలే చేయాలని అనుకోవడం లేదు. వాస్తవానికి అవి నన్ను ఆకట్టుకోవు. వీల్‌ ఛైర్‌లో ఉండే పాత్రలో నటించమన్నా నటిస్తాను. కానీ ఆ పాత్రలో అంత సంపూర్ణత ఉండాలి. నటన అంటే వస్త్రాలంకరణ, అందంగా ముస్తాభవడం అనుకోను. ఆ పాత్రకు ఎలా ఉండాలో దర్శకుడు చెప్పినట్లు సిద్ధమవుతాను. గుండుతో నటించమన్నా నాకు ఇష్టమే. నా దృష్టిలో ఇందులో వ్యక్తిగతమైనది ఏదీ లేదు. ఇదంతా నటనే. వాణిజ్య విలువలున్న చిత్రాల్లో నటించడానికి ఇష్టపడతాను. ఎందుకంటే అలాంటి సినిమాలు చేసినప్పుడే ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువవుతాము. మన ప్రతిభ, కష్టం ఎక్కువ మందికి తెలుస్తుంది. ఇటీవల ఓ పూర్తి వాణిజ్య చిత్రంలో నటించమని అడిగారు. కానీ నా పాత్ర నచ్చక సినిమా చేయలేదు. అని చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa