ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైరాలో అమితాబ్‌ మోషన్‌ టీజర్‌

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 11, 2018, 02:52 PM

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత‍్మకంగా తెరకెక్కుతున్న  ‘సైరా నరసింహారెడ్డి' లో  బాలీవుడ్‌​ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఫస్ట్‌లుక్‌ విడుదలైంది.  బిగ్‌ బీ అమితాబ్‌ 76వ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్‌  మోషన్‌ టీజర్‌ని (ఫస్ట్‌లుక్‌) అఫీషియల్‌గా రిలీజ్‌ చేసింది.  నరసింహారెడ్డి  గురు  గోసాయి వెంకన్నపాత్రలో అమితాబ్‌  పవర్‌ఫుల్‌ లుక్‌లో ఉన్న ఈ టీజర్‌  సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది.


సురేందర్ రెడ్డి  దర్శకత్వంలో భారీ తారాగణంతో మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో 151వ చిత్రంగా  సైరా రూపొందుతోంది.  కొణిదెల  బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో చిరు తనయుడు, హీరో  రామ్ చరణ్  ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా అమితాబ్ ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa