యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన జోర్దార్ సుజాత బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత మరింత పాపులర్ అయింది. జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్‌తో ప్రేమలో పడిన ఆమె, తమ బంధం ఎంత పటిష్టమైనదో చెప్పే ప్రయత్నం తరచూ చేస్తోంది. తమది ప్రమోషన్ల కోసం, టీవీ షోల కోసం పుట్టిన ప్రేమ కాదని సుజాత పేర్కొంది. ఇటీవల ఓ షోలో ప్రియుడు రాకేష్‌ను ముద్దు పెట్టుకుని, తమది జీవితాంతం కలిసుండే ప్రేమగా అభివర్ణించింది.