నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన కొత్త చిత్రం "బింబిసార". కొత్త దర్శకుడు వసిష్ట డైరెక్షన్లో సోసియో ఫాంటసీ మూవీగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల విశేషదారణను చూరగొంది. మూడురోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యి, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పండిస్తోంది.
లేటెస్ట్ గా బింబిసార మూవీ గుంటూరులో కోటి రూపాయల మార్క్ ను క్రాస్ చేసి, హిస్టరీ క్రియేట్ చేసింది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఇప్పటి వరకు విడుదలైన సినిమాలలో ఈ సినిమానే ఫస్ట్ కోటి రూపాయల క్లబ్ లో చేరిన సినిమా.
తొలి వీకెండ్ ఎలా సాలిడ్ కలెక్షన్లను రాబట్టిందో, సెకండ్ వీక్ లో కూడా బింబిసార స్ట్రాంగ్ గా ఉంది కలెక్షన్ల హావ చూపిస్తుంది.