ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌కు 9 ఏళ్ల పాటు యాంకర్‌గా వ్యవహరించిన అనసూయ ఇటీవల దానికి వీడ్కోలు పలికింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షో నుంచి బయటకు రావడానికి గల కారణాలను వెల్లడించింది. తనపై జబర్దస్త్‌లో వేసే జోకులు, బాడీ షేమింగ్‌పై కామెంట్లు, పంచులు బాధించాయని తెలిపింది. వెకిలి చేష్టలు నచ్చక నేను ముఖం మాడ్చుకున్న సందర్భాలలో వాటిని ప్రసారం చేయరని తెలిపింది. అవి నచ్చకే బయటికొచ్చినట్లు పేర్కొంది.