నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన కొత్త చిత్రం "బింబిసార". ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ బిహైండ్ ది సీన్స్ ను క్రానికల్స్ పేరిట విడుదల చేసారు. తెరమీద బింబిసారుడి ప్రపంచాన్ని సృష్టించడానికి తెరవెనుక ఎంతమంది కష్టపడ్డారు, ఏ విధంగా కష్టపడ్డారు, డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, నటీనటుల కష్టం తెలిపే ఈ వీడియో కొంచెంసేపటి క్రితమే విడుదలైంది.
వసిష్ఠ అనే కొత్త దర్శకుడు తెరేక్కించిన ఈ సోసియో ఫాంటసీ మూవీలో క్యాథెరిన్ ట్రెస్సా, సంయుక్త మీనన్, శ్రీనివాసరెడ్డి, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. ఎం. ఎం కీరవాణి, చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa