పల్లవి:
గుండె దాటి… గొంతు దాటి
పలికిందేదో వైనం
మోడువారిన మనసులోనే
పలికిందేదో ప్రాణం
ఆ కన్నుల్లోనే గంగై
పొంగిన ఆనందం
కాలంతో పరిహాసం
చేసిన స్నేహం
పొద్దులు దాటి… హద్దులు దాటి
జగములు దాటి… యుగములు దాటి
(దాటి దాటి… దాటి దాటి)
చెయ్యందించమంది… ఒక పాశం
ఋణ పాశం… విధి విలాసం
చెయ్యందించమంది… ఒక పాశం
రుణ పాశం… విధివిలాసం
చరణం1:
అడగాలే కానీ ఏదైనా
ఇచ్ఛే అన్నయ్యనౌతా
పిలవాలే కానీ పలికేటి తోడు
నీడయ్యిపోతా
నీతో ఉంటే చాలు
సరితూగవు సామ్రాజ్యాలు
రాత్రి పగలు లేదే దిగులు
తడిసె కనులు ఇదివరకెరుగని
ప్రేమలో గారంలో
చెయ్యందించమంది… ఒక పాశం
ఋణ పాశం… విధి విలాసం
ప్రాణాలు ఇస్తానంది
ఒక బంధం రుణబంధం
చరణం 2:
నోరారా వెలిగే నవ్వుల్ని
నేను కళ్ళారా చూసా
రెప్పల్లో ఒదిగే కంటిపాపల్లో
నన్ను నేను కలిసా
నీతో ఉంటే చాలు
ప్రతి నిమిషం ఓ హరివిల్లు
రాత్రి పగలు లేదే గుబులు
మురిసే ఎదలు ఇదివరకెరుగని
ప్రేమలో.. గారంలో
ప్రాణాలు ఇస్తానంది ఒక పాశం
రుణపాశం… విధివిలాసం
చెయ్యందించమంది
ఒక బంధం ఋణబంధం
ఆటల్లోనే పాటల్లోనే
వెలిసిందేదో స్వర్గం
రాజే నేడు బంటై పోయినా
రాజ్యం నీకే సొంతం