రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త చిత్రం "హైవే". కంటెంట్ పరంగా ఎప్పుడూ రిచ్ నెస్ కోరుకునే తెలుగు ఓటిటి 'ఆహా'లో ఆగస్టు 19 నుండి ఈ వెబ్ ఫిలిం స్ట్రీమింగ్ కాబోతుంది.
లేటెస్ట్ గా కొంచెంసేపటి క్రితమే ఈ మూవీ ట్రైలర్ ను యంగ్ హీరో నాగశౌర్య లాంచ్ చేసారు. టీజర్ తో ఏర్పడిన అంచనాలు ట్రైలర్ తో రెట్టింపయ్యాయి. సైకో థ్రిల్లర్స్, అడ్వెంచరస్ మూవీస్ ను ఇష్టపడేవాళ్ళకు ఈ మూవీ బాగా నచ్చేటట్టు ఉంది.
అభిషేక్ బెనర్జీ, సయామీ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ చిత్రానికి KV గుహన్ డైరెక్టర్ కాగా వెంకట్ తలారి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైమన్ కే కింగ్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa