మెగా డాటర్ నిహారిక కొణిదెల తన సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై "హలో వరల్డ్" అనే కొత్త వెబ్ సిరీస్ ను గతంలో ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
తెలుగు, తమిళ భాషలలో ఆగస్టు 12 నుండి జీ 5 ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్, తాజాగా ఐదు కోట్ల పై చిలుకు స్ట్రీమింగ్ మినిట్స్ ను సొంతం చేసుకుంది. 'సొంతం' ఫేమ్ ఆర్యన్ రాజేష్ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు. జలదంకి శివసాయివర్ధన్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో సదా, రామ్ నితిన్, నిఖిల్ తదితరులు నటించారు. PK దండి సంగీతం అందించారు.