యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త చిత్రం "నేను మీకు బాగా కావాల్సిన వాడిని" నుండి ఇటీవలే విడుదలైన 'నచ్చావ్ అబ్బాయ్' అనే లిరికల్ సాంగ్ యొక్క మేకింగ్ వీడియో రిలీజ్ అయ్యింది.
ఈ చిత్రంతో కార్తిక్ శంకర్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సంజనా ఆనంద్ హీరోయిన్ గా నటిస్తుంది. కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై కోడి రామకృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
పోతే, ఈ చిత్రం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.