టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి తనయుడు శ్రీ సింహ హీరోగా, సతీష్ త్రిపుర డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం "దొంగలున్నారు జాగ్రత్త". ప్రీతి అస్రాని ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, మంజర్ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై సురేష్ బాబు దగ్గుబాటి, సునీత తాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఈ రోజు సాయంత్రం 04:05 గంటలకు ఎనౌన్స్ చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. సముద్రఖని ఈ సినిమాలో కీలకపాత్రను పోషిస్తున్నారు.