"మత్తు వదలరా" ఫేమ్ శ్రీ సింహ హీరోగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం "దొంగలున్నారు జాగ్రత్త". ఇందులో డైరెక్టర్ కమ్ యాక్టర్ సముద్రఖని క్రూషియల్ రోల్ లో నటిస్తున్నారు.
లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 23వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతున్నట్టు కొంచెంసేపటి క్రితమే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, మంజర్ స్టూడియోస్ సంయుక్త బ్యానర్లపై సురేష్ బాబు దగ్గుబాటి, సునీత తాటి నిర్మిస్తున్న ఈ చిత్రం లో ప్రీతి అస్రాని హీరోయిన్ గా నటిస్తుంది.