నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ "ప్రాజెక్ట్ K" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. ఈ హై బడ్జెట్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించనున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'ప్రాజెక్ట్ K' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుదుతున్న ఈ సినిమా దాదాపు 10 భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా ఇప్పుడు ప్రాజెక్ట్ K రెండు భాగాలుగా విడుదల కానుందని ఒక ఆసక్తికరమైన బజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ వార్త పై మూవీ మేకర్స్ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ విఎఫ్‌ఎక్స్ హై ఆన్ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.