ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ZEE5లో సెన్సేషన్ ని సృష్టిస్తున్న 'హలో వరల్డ్' వెబ్ సిరీస్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 17, 2022, 04:54 PM

భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ZEE5 ఒకటి. ఈ పాపులర్ OTT ప్లాట్ఫారం తాజాగా 'హలో వరల్డ్' అనే టైటిల్ తో ఒక కొత్త వెబ్ సిరీస్ ని విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. శివసాయి వర్ధన్ రచన, దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ గత శుక్రవారం విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ హిట్ సిరీస్ 5 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసినట్లు సమాచారం. ఇదే విషయాన్ని మూవీ మేకర్స్ తమ సోషల్ ప్రొఫైల్స్‌లో అధికారికంగా ప్రకటించారు. ఈ సిరీస్‌లో ఆర్యన్ రాజేష్, సదా, నిఖిల్, అనిల్, రామ్ నితిన్, నయన్ కృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై ఈ వెబ్ సిరీస్ ని నిహారిక కొణిదెల నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com