రౌడీ హీరో, సెల్ఫ్ మేడ్ స్టార్ ... అనతికాలంలోనే విశేష ప్రేక్షకాదరణను, స్టార్ హీరో క్రేజ్ ను సంపాదించిన ఏకైక హీరో విజయ్ దేవరకొండ. "లైగర్"తో తొలిసారిగా పాన్ ఇండియా బరిలోకి దిగబోతున్న విజయ్ కొన్నాళ్ళనుండి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రమోషనల్ టూర్స్ లో చురుగ్గా పాల్గొంటూ, తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకుంటున్నాడు.
తెలుగులో రౌడీ హీరోకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకున్నా హిందీలో కూడా అంతే ఫ్యాన్స్ ఉన్నారు విజయ్ కి. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో విజయ్ కు సంబంధించిన వీడియో ఒకటి ఆయనపై ఫ్యాన్స్ లో మరింత గౌరవాన్ని, అభిమానాన్ని తీసుకొస్తుంది.
అదేంటంటే, ఎడతెరిపి లేకుండా జరుగుతున్న ప్రమోషన్స్ కారణంగా విజయ్ సివియర్ బ్యాక్ పెయిన్ కు గురైనట్టు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియో ద్వారా తెలుస్తుంది. ఈ బ్యాక్ పెయిన్ ను ఏమాత్రం ఖాతరు చెయ్యని విజయ్ ఆ నొప్పితోనే ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. నిజంగా ఆయన సెల్ఫ్ మేడ్ స్టార్, ఈ కష్టానికి తగిన ఫలితం తప్పక దక్కుతుంది... అంటూ విజయ్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.